పవన్ కల్యాణ్ మేడే సందేశంపై పీవీ సింధు స్పందన
- మేడే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశంసించిన పీవీ సింధు
- కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను మెచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్
- గ్రామీణ ఏపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం సంతోషకరమన్న సింధు
- పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీవీ సింధు
ఈ సందర్భంగా పీవీ సింధు స్పందిస్తూ, "కార్మికుల సంక్షేమం, గౌరవం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూడటం చాలా సంతోషంగా ఉంది. దీనితో పాటు గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం అభినందనీయం. మేడే రోజున ఇది ఎంతో అర్థవంతమైన సందేశం. మన ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని పేర్కొంది.