కవిత పార్టీ 'టీఆర్ఎస్' పేరుకు దిగువన 'అసోసియేషన్'.. ఎందుకు?
- నేడు పార్టీ పేరును ప్రకటించిన కవిత
- కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ను పోలి ఉన్న కవిత పార్టీ
- లీగల్ సమస్య రాకుండా ఈ పదాన్ని చేర్చారనే అభిప్రాయాలు
క్లుప్తంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ను పోలేలా తన పార్టీ పేరు ఉండేలా కవిత చూసుకున్నారు. కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించినప్పటికీ, దాని కింద చిన్న అక్షరాల్లో 'అసోసియేషన్' అని కనిపించింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ను పోలిన నేపథ్యంలో లీగల్ సమస్య రాకుండా ఉండేందుకు కింద అసోసియేషన్ అని చేర్చినట్లు తెలుస్తోంది.