మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహిళ
- సికింద్రాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించిన మహిళ
- ఆ బంగారం ఇస్తామని చెప్పడంతో అల్లుడు అడుగుతున్నాడన్న మహిళ
ఆడపిల్ల వివాహానికి తులం బంగారం ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆ మహిళ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో అన్నారు. వివాహం సమయంలో ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం ఇస్తామని మా అల్లుడికి చెప్పడంతో, అతను అడుగుతున్నట్లు తెలిపారు. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ, హామీ ఇచ్చిన వారు ఇవ్వడం లేదని, దానికి మనమేం చేస్తామని సమాధానం ఇచ్చారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివాహం కోసం ప్రతి ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.