మళ్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆస్వస్థత..వెల్లూరు ఆసుపత్రిలో చేరిక
- వెల్లూరు ఆసుపత్రిలో చేరిన కోటంరెడ్డి
- న్యూరో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం
- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు నుంచి ఆరు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. గతంలో ఇదే సమస్యకు ఆయన కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
కాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడం ఇది మొదటిసారి కాదు. 2022 మే నెలలో వైసీపీలో ఉన్నప్పుడు, ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు.