రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు
- 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల
- మార్చి 16న ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు
మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్‌గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల, మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు, మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.