బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు
- బాల్క సుమన్‌తో పాటు మరో ఐదుగురు బీఆర్ఎస్ శ్రేణులపై కేసుల నమోదు
- చెన్నూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బాల్క సుమన్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- బాల్క సుమన్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
కాసిపేట ఎస్‌హెచ్ఓ గంగారం ఇచ్చిన ఫిర్యాదుతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ తో పాటు మరో ఐదుగురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు మిగిలిన నాయకులను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. సుమన్‌ను అరెస్టు చేస్తారన్న సమాచారంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని మంత్రి వివేక్ వెంకట స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిన్నటి ఘర్షణలు, బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు.