మాకు భారత్‌పై మంచి రికార్డేమీ లేదు: పాకిస్థాన్ కెప్టెన్
- గత చరిత్రను మార్చలేమన్న కెప్టెన్ సల్మాన్ అలీ అఘా
- కొలంబోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి
- రేపు కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి కూడా సల్మాన్ అలీ స్పందించాడు. అభిషేక్ మంచి ఆటగాడని కితాబిచ్చాడు. అత్యుత్తమ జట్టుతో ఆడాలని తాము కోరుకుంటున్నామని అన్నాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ ఎనిమిదిసార్లు తలపడగా, ఏడుసార్లు టీమిండియా, ఒకసారి దాయాది దేశం గెలిచింది.