క్యాస్టింగ్ కౌచ్ ఉంది... మహిళలను వాడుకునేందుకే కొందరు సినిమాలు తీస్తారు: తమ్మారెడ్డి భరద్వాజ
- టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశమైన క్యాస్టింగ్ కౌచ్
- ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరన్న తమ్మారెడ్డి
- సినీ పరిశ్రమ తొలి రోజుల నుంచే ఈ సమస్య ఉందని వ్యాఖ్య
మరోవైపు, ఇదే అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తొలి రోజుల నుంచే ఈ సమస్య ఉందని చెప్పారు. ఒకప్పుడు రాజ కుటుంబాల వారు, జమీందారులు మహిళల కోసమే సినిమాలు తీసేవారని అన్నారు.
ప్రస్తుతం ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే... వాటిలో 30 నుంచి 40 సినిమాలు మహిళలను వాడుకునే ధోరణితోనే నిర్మితమవుతున్నాయిని తమ్మారెడ్డి చెప్పారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలోని ఒకరిద్దరు సినీ పెద్దల్లో ఉందని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమేనని చెప్పారు.