కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ
- నంది నగర్ లోని నివాసంలో నోటీసులు అందించిన సిట్
- విచారణకు పీఎస్ కు రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు
- ప్లేస్ చెబితే తామే అక్కడకు వస్తామని వెల్లడి
కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే... అక్కడకే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి తెలియజేసింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.