అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- తల్లి అంజనా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేసిన మెగాస్టార్
- కుటుంబ సభ్యులతో కూడిన మధుర క్షణాల వీడియో షేర్
- అంజనమ్మకు విషెస్ తెలుపుతున్న మెగా అభిమానులు
"అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులందరితో అంజనా దేవి గడిపిన అరుదైన, మధురమైన క్షణాలతో ఈ వీడియోను రూపొందించారు. కుటుంబ వేడుకలు, పండుగల్లోని ఫొటోలు, పాత జ్ఞాపకాలతో కూడిన ఈ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.