సొంతూరిలో పేర్ని నానిపై కేసు నమోదు
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై అనుచిత వ్యాఖ్యల ఫలితం
- మచిలీపట్నంలో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు
- వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఇటీవల జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం పెద్దదైంది.
టీడీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద పేర్ని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.