అసెంబ్లీలో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కరచాలనం.. వీడియో ఇదిగో!
- కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి
- ఆరోగ్యం గురించి వాకబు చేసిన రేవంత్
- రెండు నిమిషాలు సభలో ఉండి వెళ్లిపోయిన కేసీఆర్
రెండు నిమిషాల తర్వాత వెళ్లిపోయిన కేసీఆర్
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.