క్రికెటర్ శ్రీ చరణికి ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
- ప్రపంచకప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం
- రూ. 2.50 కోట్ల నగదు పురస్కారం ప్రకటన
- కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయింపు
కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తింపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందించింది.