గవర్నర్ తో జగన్ భేటీ షెడ్యూల్ మార్పు
- మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ పోరాటం
- కోటి సంతకాల సేకరణ చేపట్టిన ప్రతిపక్షం
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇది ప్రైవేటీకరణేనంటూ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమాన్ని చేపట్టింది.
18వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను జగన్ కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి అందజేస్తారు.