వీరయ్య చౌదరి హత్య కేసు.. నిందితుడి ముందస్తు బెయిల్ కు సుప్రీం తిరస్కరణ
––
ఈ కేసులో సురేశ్ బాబు ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్ వంటి కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కు సురేశ్ బాబుకు అర్హతలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో మిగతా నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన విషయాన్ని సురేశ్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ముందస్తు బెయిల్ విషయంలోనూ కింది కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.