ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఆనందంలో భార్యకు ఫ్లయింగ్ కిస్ విసిరిన విరాట్.. వీడియో ఇదిగో!
- లక్నో ఏకానా స్టేడియంలో క్యూట్ మూమెంట్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- విరుష్క జోడీకి అభిమానుల ప్రశంసలు
లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, విరాట్ కోహ్లీ మైదానం నుంచి పెవిలియన్‌కు వెళ్తుండగా, స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అనుష్క కూడా అంతే ప్రేమగా విరాట్‌కు ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇచ్చారు. ఈ అందమైన దృశ్యం కెమెరాల్లో రికార్డయింది. కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు "రియల్ లవర్ బాయ్! విరుష్క" అంటూ కామెంట్లతో ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.