రూ. 100 కోట్ల మార్క్‌వైపు 'హిట్-3' పరుగులు
- నాని, శైలేశ్ కొలను కాంబోలో ‘హిట్-3’
- ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ
- మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లు
- 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 82కోట్ల (గ్రాస్)కు పైగా కలెక్షన్స్
- ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన మేకర్స్
ఇక మూడోరోజు శనివారం వీకెండ్ కావడంతో హిట్-3 భారీ వసూళ్లు కొనసాగాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 82కోట్ల (గ్రాస్)కు పైగా రాబట్టినట్టు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఇట్స్ సర్కార్ షో” అంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈరోజు ఆదివారం కావడంతో ఈజీగా రూ. 100కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఈ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.