ఐపీఎల్ చరిత్రలో అన్ని స్థానాల్లోనూ బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా విండీస్ ఆల్‌రౌండర్
- కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ నరైన్
- ఓపెనర్‌గానే అత్యధిక పరుగులు
- మొత్తం 17 సార్లు డకౌట్
- ఇప్పటి వరకు ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు చేసిన నరైన్
సునీల్ నరైన్ ఓపెనర్‌గా 59 సార్లు దిగాడు. మూడు, ఆరో స్థానాల్లో ఒక్కోసారి ఆడాడు. 8 సార్లు నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో ఏడుసార్లు ఆడాడు. ఏడో స్థానంలో ఆరు సార్లు, 8వ స్థానంలో 13 సార్లు, 9వ స్థానంలో 9 సార్లు, పదో స్థానంలో 8 సార్లు బ్యాటింగ్ చేశాడు. 11వ స్థానంలో 3 సార్లు ఆడాడు.
అయితే, ఓపెనర్‌గా తప్ప మరే స్థానంలోనూ పెద్దగా రాణించలేకపోయాడు. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్‌గా అత్యధికంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తంగా ఇప్పటి వరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే, ఎన్నోసార్లు తన అద్వితీయమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు.