ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడి అరెస్ట్
- అహ్మద్ బాషాపై కడపలో పోలీసు కేసులు
- ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ
- కువైట్ వెళుతుండగా ముంబయి ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
కడపలోని వినాయకనగర్‌లో స్థలం విషయంలో దాడికి పాల్పడినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. అంతేకాకుండా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని దూషించినందుకు కూడా అతడిపై కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, దేశం విడిచి వెళుతుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ బాషాను కడపకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు.