Jagga Reddy: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సినిమా ఆఫీసు.. ఉగాదినాడు ప్రారంభం

- ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ అనే సినిమాను నిర్మిస్తూ నటిస్తున్న జగ్గారెడ్డి
- ఉగాది రోజున ఉదయం 11 గంటలకు ఆఫీస్ ప్రారంభం
- ఈ సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదన్న జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సినిమా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆయన ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో నటిస్తున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆ రోజున ఉదయం 11 గంటలకు ఈ సినిమా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.
జగ్గారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ పనులను ఈ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌కు భారీ స్పందన వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాది నాటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో తన పాత్రకు, ప్రేమకు సంబంధం ఉండదని జగ్గారెడ్డి తెలిపారు. ఇంటర్వెల్‌కు ముందు తన పాత్ర మొదలై చివరి వరకు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదని వివరించారు. తాను విద్యార్థి నేత స్థాయి నుంచి కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎలా ఎదిగిందీ ఈ సినిమాలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఉంటుందని జగ్గారెడ్డి వివరించారు.