మరింత ముందుకొచ్చిన ‘ఆదిత్య 369’ .. రీ రిలీజ్ డేట్ ఇదే!
- 1991లో విడుదలైన 'ఆదిత్య 369'
- ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య
- ఆయన కెరియర్లో ఈ సినిమా స్థానం ప్రత్యేకం
- ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయాలనుకున్న టీమ్
- 4వ తేదీనే రీ రిలీజ్ చేస్తున్నట్టు తాజా ప్రకటన
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - “నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్‌కి సిద్ధమైంది. మంచి థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అన్నారు.