అమెరికా చిప్ తయారీ కంపెనీలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల వేతన ప్యాకేజీ
- హైదరాబాద్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరికి ఉద్యోగం
- చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో మంచి ప్యాకేజీ
- ఎన్విడియాలో డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగం
ఇంటర్‌లో మెరుగైన స్కోరు సాధించి ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్‌ను అభ్యసించాడు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ. 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అనంతరం లాస్‌ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.