తమిళనాడు నిర్వహించే భేటీకి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళుతుంది: జానారెడ్డి
- ఈ అంశంపై మరిన్ని సమావేశాలు కొనసాగుతాయని వెల్లడి
- తమిళనాడు భేటీకి అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు వెళతారని వెల్లడి
- భవిష్యత్తులో అన్ని పార్టీలు వస్తాయన్న జానారెడ్డి
సమావేశం ముగిసిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై మరిన్ని సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే సభకు అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు సమావేశానికి వెళతారని అన్నారు. కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమేనని, భవిష్యత్తులో అందరూ వస్తారని ఆయన అన్నారు.