అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం: హరీశ్ రావు
- స్పీకర్ ను జగదీశ్ రెడ్డి అవమానించలేదన్న హరీశ్ రావు
- రికార్డులు తీయాలని స్పీకర్ ను అడిగినా తెప్పించలేదని విమర్శ
- అసెంబ్లీ మీడియా పాయింట్ ను కూడా బ్లాక్ చేశారని మండిపాటు
దళిత స్పీకర్ ను అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదని హరీశ్ అన్నారు. స్పీకర్ ను కలిశామని... రికార్డులు తీయాలని అడిగామని చెప్పారు. 15 నిమిషాలు అయినా వీడియో రికార్డును స్పీకర్ తెప్పించలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బ్లాక్ చేశారని... స్పీకర్ ప్రజాస్వమ్యబద్ధంగా పని చేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.