బాలీవుడ్ పతనం కావడానికి కారణం ఇదే: ఆమిర్ ఖాన్
- బాలీవుడ్ ని వెనక్కి నెట్టేసిన దక్షిణాది సినిమాలు
- బాలీవుడ్ పతనానికి ఓటీటీలే కారణమన్న ఆమిర్ ఖాన్
- ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారని వ్యాఖ్య
ఉత్తరాది సినిమానా? లేక దక్షిణాది సినిమానా? అనేది ముఖ్యం కాదని ఆమిర్ అన్నారు. బాలీవుడ్ వెనుకబడటానికి ఓటీటీలే కారణమని చెప్పారు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవాళ్లని చెప్పారు. ఇప్పుడు సినిమా ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు వచ్చి చూడటం లేదని అన్నారు. సినిమాను ఎక్కడి నుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్ తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని చెప్పారు. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని కోరారు.