ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు ప్రకటించిన మంత్రి పొన్నం
- 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న ప్రభుత్వం
- తొలి దశ బస్సులను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా ఈ బస్సులు నడవనున్నాయి. తొలి దశలో 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నారు. తరువాతి దశలో 450 బస్సులకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. మొత్తం 600 బస్సులను తీసుకుని నడుపుతారు. ఈ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు.