మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మోహన్ లాల్ 'L2ఇ ఎంపురాన్'
- మోహన్ లాల్ ప్రధాన పాత్రలో 'L2ఇ ఎంపురాన్'
- ఇటీవల కొచ్చిలో టీజర్ విడుదల
- చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి
ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లూసిఫర్, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
తొలి భాగం లూసిఫర్ హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఆదివారం నాడు కొచ్చిలో L2ఇ ఎంపురాన్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రంలో మంజు వారియర్, టొవినో థామస్ వంటి ప్రముఖ తారాగణం నటించింది.