అడిగి తీసుకోవాలి.. అభిమానులకు సాయిపల్లవి సూచన
- బయటకు వెళ్లినపుడు ఫొటోలు తీసుకోవడంపై అసంతృప్తి
- నేనూ మనిషినే కదా అంటూ వ్యాఖ్య
- తనను ఫొటోలు తీయడం అస్సలు నచ్చదన్న నటి
అనుమతి కూడా అడక్కుండా ఫొటోలు తీయడం చూస్తుంటే తన పర్మిషన్ లేకుండా వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారని అనుకుంటానని సాయిపల్లవి తెలిపారు. కాగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన అమరన్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన నటించిన తండేల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు, సాయిపల్లవి బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీ రామాయణం చిత్రంలో సాయిపల్లవి నటిస్తున్నారు.