మెగా బ్రదర్స్ ముగ్గురు కాదు... నలుగురు: కిరణ్ రాయల్
- లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్న కిరణ్
- పవన్ ను సీఎంగా చూడాలని తాము పదేళ్లుగా చూస్తున్నామని వ్యాఖ్య
- వైసీపీ నేతలు విమర్శించడానికి అవకాశం ఇవ్వొద్దని సూచన
ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో... దాన్నే కొనసాగిస్తే మంచిదని కిరణ్ చెప్పారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు విమర్శించడానికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రోజా, పేర్ని నాని వంటి వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వొద్దని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంపై డ్రోన్లు తిరుగుతున్నాయని... అందుకే పవన్ కు భద్రత పెంచాలని అన్నారు.