Chandrababu: రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

Chandrababu lokesh wishes Bhogi to people

  • భోగి పండుగ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలన్న చంద్రబాబు
  • ప్రజాప్రతినిధులుగా అన్ని వేళలా మీతోనే ఉంటామని చంద్రబాబు హామీ
  • భోగి మంటలు ప్రజల జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన నారా లోకేశ్

రాష్ట్ర ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేము అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

మంత్రి నారా లోకేశ్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ .. సంక్రాంతికి ముందు  రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. భోగి మంటల్లో ఏ విధంగా పాతదనం కాలిపోయిందో .. మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలని, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.  

Chandrababu
Jayaprakash Narayan
bhogi wishes

More Telugu News