గేమ్ ఛేంజర్ కు రామ్ చరణ్ పారితోషికం ఎంతంటే..!
- టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల జాబితాలో చెర్రీ
- ఒక్కో సినిమాకు రూ. వంద కోట్లు తీసుకుంటారని ప్రచారం
- తాజా సినిమా గేమ్ ఛేంజర్ కు మాత్రం రూ.65 కోట్లే తీసుకున్నారట
దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ నెల 10న థియేటర్లకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. పాటలు, పోస్టర్స్ అన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండడంతో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పై చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ కు సంబంధించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.