గాయని శివశ్రీని పెళ్లాడబోతున్న కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
- గాయనిగా, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణిగా శివశ్రీకి గుర్తింపు
- పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా కన్నడ వెర్షన్ పాట పాడిన శివశ్రీ
- మార్చి 24న బెంగళూరులో వివాహం
- దేశంలోని అత్యంత పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరిగా తేజస్వి సూర్యకు గుర్తింపు
తేజస్వి సూర్య వృత్తి పరంగా న్యాయవాది. ప్రస్తుతం బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన సూర్య కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై 3.31 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సెప్టెంబర్ 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, 34 ఏళ్ల సూర్య ‘ఐరన్‌మ్యాన్ 70.3 ఎండ్యురన్స్ రేస్’ పూర్తి చేసిన తొలి సిట్టింగ్ ఎంపీగా గతేడాది రికార్డు సృష్టించారు. సూర్య, స్కంద వివాహం మార్చి 24న బెంగళూరులో జరగనుంది.
.