ఎవరో పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?... దీన్ని టాలీవుడ్ ఖండించాలి: అల్లు అర్జున్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి
- అల్లు అర్జున్ పేరు మర్చిపోయినందునే రేవంత్ రెడ్డి కక్ష కట్టారన్న బీఆర్ఎస్ నేతలు
- అసత్య ప్రచారం నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య
- సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్న సీఎం
ఇక, సినిమా వాళ్లు సామాజిక అంశాలపై ప్రచార చిత్రాలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 'మా' అసోసియేషన్‌కు కావాలంటే స్థలాలు ఇస్తామని, సినీ పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. తాను సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్నారు.
ఈరోజు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే.