ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. ఒక కుటుంబం అనాథ అయింది.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కామెంట్స్
- అనాథ అయిన కుటుంబం గురించి ఎవరూ మాట్లాడడం లేదన్న చామల
- శాంతిభద్రతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండవని చురక
- బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శ
- వీఐపీలు ఇకపై జాగ్రత్తగా ఉంటారన్న భువనగిరి ఎంపీ
శాంతి భద్రతలు అనేవి తెలంగాణలో ఒకలా, కర్ణాటక, మహారాష్ట్రలో మరోలా ఉండవని చామల పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీఐపీల మీద కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పోలీసు వ్యవస్థ, చట్టం చూసుకుంటుందని అన్నారు. ఈ ఘటనతోనైనా వీఐపీలు జాగ్రత్తగా ఉండాలని భావిస్తారని పేర్కొన్నారు.