అల్లు అర్జున్ కేసు గురించి అధికారులకు 4 ప్రశ్నలు వేసిన రాంగోపాల్ వర్మ
- పుష్కరాల్లో ఎవరైనా పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్న
- ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో పోతే నాయకులను అరెస్ట్ చేస్తారా? అని నిలదీత
- భద్రతా ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే అన్న వర్మ
1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?
3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?
4. భద్రత ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే తప్ప... సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ వర్మ ప్రశ్నలు సంధించారు.