అల్లు అర్జున్‌ను విడుదల చేయకుంటే కోర్టులో పిల్ వేస్తా: కేఏ పాల్
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిసిందన్న పాల్
- ర్యాలీ సందర్భంగా పలువురు మృతి చెందితే చంద్రబాబును అరెస్ట్ చేశారా? అని ప్రశ్న
- పుష్కరాల్లో చంద్రబాబు స్టంట్ కారణంగా 23 మంది మృతి చెందారన్న పాల్
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు సరే... మరి చంద్రబాబు కందుకూరులో ర్యాలీ నిర్వహించినప్పుడు 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారన్నారు. 2019లో ఆయన పుష్కరాల్లో స్టంట్స్ చేస్తే 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? విచారణకు పిలిచారా? అని నిలదీశారు. బలవంతులైన రాజకీయ నేతలకు ఓ న్యాయం... సాధారణ వ్యక్తులు, నటులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.