పుష్ప-2 కలెక్షన్ల సునామీ.. సంచలన రికార్డు!
- అన్ని వెర్షన్లలో భారీ వసూళ్లు రాబడుతున్న మూవీ
- నేడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
- అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమాగా అవతరించే ఛాన్స్
మూవీ కలెక్షన్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘శాక్‌నిల్క్’ ప్రకారం పుష్ప-2 మంగళవారం రూ. 52.50 కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వెర్షన్‌లో రూ. 38 కోట్లు, తెలుగులో రూ. 11 కోట్లు, తమిళంలో రూ. 2.60 కోట్లు రాబట్టింది. నేడు (బుధవారం) కూడా ఇదే స్థాయిలో రాణిస్తే రికార్డు నెలకొల్పడం ఖాయంగా ఉంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.900 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.922 కోట్లు వసూలు చేసిందని ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధికారికంగా ప్రకటించారు.