Viral Videos: మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ నుంచి లీక్ అయిన వీడియో

 Viral Video Leaked About Manchu Family Fight In Farmhouse

  • చుట్టూ జనం మధ్య కుర్చీలో కూర్చున్న మోహన్ బాబు
  • ఇద్దరు యువకులను చెంప దెబ్బలు కొడుతూ ఫోన్లు లాక్కున్న బౌన్సర్
  • మేడపై నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన గుర్తుతెలియని వ్యక్తి

మంచు కుటుంబంలో వివాదం నేపథ్యంలో జల్ పల్లి ఫాంహౌస్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాకు లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం కనిపిస్తోంది. పెదరాయుడి తరహాలో మోహన్ బాబు కుర్చీలో కూర్చుని ఉండగా.. చుట్టూ జనం నిలబడి ఉన్నారు. ఈ వీడియోను మేడ పై నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఎవరు తీశారనే విషయం మాత్రం తెలియరాలేదు. 

వీడియోలో ఏముందంటే...
మోహన్ బాబు ఫాంహౌస్లో ఆరు బయట కుర్చీలో కూర్చుని ఉండగా ఓ బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేశాడు. చెంపపై కొడుతూ ఆ యువకుల సెల్ ఫోన్లు లాక్కున్నాడు. మోహన్ బాబు కళ్లముందే ఈ దాడి జరగడం గమనార్హం. చుట్టూ జనం ఉన్నప్పటికీ ఎవరూ ఆ బౌన్సర్ ను అడ్డుకోలేదు. సెల్ ఫోన్ లో వీడియో, ఫొటోలు తీశారనే కారణంతో వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా బిల్డింగ్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వీడియో తీసి మీడియాకు లీక్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు, వీడియో ఎలా ఎందుకు తీశారనే వివరాలు తెలియలేదు. సాంబశివారెడ్డి పేరం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News