ఓటీటీలోకి వస్తున్న వేట్టయాన్
- రజనీకి మరో హిట్ తెచ్చిపెట్టిన సినిమా 'వేట్టయాన్'
- ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
- తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి మూవీ
ఇక భారీ అంచనాల నడుమ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. జైలర్ తర్వాత రజనీ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ యాక్షన్ .. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యాక్షన్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రంలో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషించారు.