స్నేహితుడికి రామ్ చరణ్ బర్త్‌డే విషెస్
"నా ప్రియమైన మిత్రుడు విక్రమ్‌రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన కథలు చెప్పడం కొనసాగించండి. మీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ 'విశ్వంభర' మూవీకి ఆల్ ది బెస్ట్" అంటూ చెర్రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు తన మిత్రులు హీరో శర్వానంద్, విక్రమ్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను చరణ్ జోడించారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో 'విశ్వంభర' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.