పవన్ కల్యాణ్ టైటిల్‌తో యాంకర్ ప్రదీప్ సినిమా
- సినిమా కోసం బుల్లితెర షో లను వదులుకున్న ప్రదీప్
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్‌తో రెండో సినిమా
- దర్శకత్వం చేస్తున్న ద్వయం నితిన్-భరత్‌లు
ప్రస్తుతం ఈ యువ హీరో తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా కోసమే టీవీ షోలకు దూరంగా వుంటున్నాడు. సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం ద్వారా బబర్ధస్త్‌తో పాటు పలు కామెడీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్‌లు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే టైటిల్‌ను నిర్ణయించారు.
పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం టైటిల్ కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యూత్‌కు నచ్చే ఓ మంచి ప్రేమకథను కూడా జోడించారట. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్
