అఖండగా 'తాండవం' చేయనున్న బాలకృష్ణ.. 'బీబీ4' పోస్టర్ విడుదల
- నాలుగోసారి జతకడుతున్న బాలయ్య, బోయపాటి శ్రీను
- అఖండ సీక్వెల్‌గా 'అఖండ 2-తాండవం'
- ఈ రోజు హైదరాబాద్‌లో మూవీ ప్రారంభోత్సవం
- 14 రీల్స్ సంస్థ నిర్మాణం.. థమన్ సంగీతం
'అఖండ 2-తాండవం' పేరుతో మూవీ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అఖండ-2ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.