రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్‌పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడి దాడి.. వీడియో ఇదిగో!
- 2021లో కావ్యశ్రీ నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకున్న నల్లూరి శ్రీనివాస్
- ఈవెంట్ కోసం రాజమండ్రి వచ్చిన కావ్యశ్రీ
- డబ్బుల కోసం అడిగితే ఆఫీసుకు రమ్మన్న శ్రీనివాస్
- అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిన వారిపై దాడి
ఓ ఈవెంట్ కోసం రాజమండ్రి వచ్చిన కావ్యశ్రీ డబ్బుల గురించి శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే ఆఫీసుకు రమ్మన్నారని, కానీ, అక్కడికి వెళ్లాక వారు కనిపించలేదని కావ్యశ్రీ పేర్కొన్నారు. దీంతో తండ్రితో కలిసి ఆయన ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతారా? అని బూతులు తిడుతూ తన తండ్రిపై దాడిచేశారని కావ్యశ్రీ ఆరోపించారు. ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తుండటంతో తనపైనా దాడిచేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.