సంక్రాంతికి వస్తున్న సందీప్ కిషన్ 'మజాకా'.. ఫస్ట్ లుక్ విడుదల
- సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో 'మజాకా'
- పెళ్లికొడుకు గెటప్ లో సందీప్ కిషన్ ఫస్ట్ లుక్
- కీలక పాత్రలు పోషిస్తున్న రావు రమేశ్, అన్షు
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ. 23 కోట్లకు అమ్ముడుపోయాయి.