శ్రీకాకుళంలో తేనెటీగల దాడి.. ఇద్దరు కూలీల మృతి
--
మరో ముగ్గురు కూలీలు గాయపడగా గ్రామస్థులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లంకపేటకు చేరుకుని విచారణ జరుపుతున్నారు.