హైదరాబాద్‌లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి: పొన్నం ప్రభాకర్
- హైదరాబాద్ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్య
- ఇలాంటి చోట్ల ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
- అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పొన్నం ప్రభాకర్
సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.