రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ వేట్టైయాన్ విడుదల తేదీ వచ్చేసింది
- అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- రజనీకాంత్-లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో నాలుగో మూవీ
- కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్
వేట్టైయాన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అంధాకానూన్, గిరఫ్తార్, హమ్ సినిమాల తర్వాత రజనీ- అమితాబ్ కలిసి నటించిన నాలుగో సినిమా ఇది. మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికాసింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.