ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ
- హైదరాబాద్‌లోని విజయమ్మ ఇంట్లో సమావేశం
- ఆప్యాయంగా పలకరించుకున్న విజయమ్మ, ప్రభాకర్‌రెడ్డి
- ఏం మాట్లాడుకున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ
విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉండడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఆమెను కలిసినట్టు చెప్తున్నారు. ఇద్దరూ చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్‌రెడ్డి అనుచరులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ విషయమై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.