రైమ్ తో కలిసి లండన్ లో రామ్ చరణ్ ఫొటో షూట్
- లండన్ ట్రిప్ వెళ్లిన రామ్ చరణ్
- రామ్ చరణ్ తో కలిసి ఫొటో షూట్ కు ముస్తాబైన పెంపుడు శునకం రైమ్
- అభిమానులను అలరిస్తున్న ఫొటోలు
రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ 'రైమ్' ను కూడా వెంటబెట్టుకుని వెళుతుంటారు. ముద్దుల తనయ క్లీంకార ఒకరి చేతుల్లో ఉంటే, రైమ్ మరొకరి చేతుల్లో ఉండడం అనేక పర్యాయాలు ఎయిర్ పోర్టుల్లో కనిపించింది.
రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
