ఓవైపు సేనాపతి, మరోవైపు వేట్టయాన్... కమల్ హాసన్, రజనీకాంత్ తాజా పిక్ వైరల్
- 'ఇండియన్-2'తో ప్రేక్షకుల ముందుకు రానున్న కమల్ హాసన్
- ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రం చేస్తున్న రజనీ
- ఇరువురితో కలిసి 'ఇండియన్-2' ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుందర్ రాజ్ ఫొటోగ్రాఫ్
తాజాగా, వీరిద్దరూ సెట్స్ పై కలిసిన ఫొటో వైరల్ అవుతోంది. ఇండియన్-2 చిత్రంలోని సేనాపతి గెటప్ లో కమల్ హాసన్... వేట్టయాన్ రజనీకాంత్... మధ్యలో ఇండియన్-2 ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుందర్ రాజ్ ను ఆ ఫొటోలో చూడొచ్చు.
కాగా, కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న 'ఇండియన్-2' చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
రజనీకాంత్ నటిస్తున్న 'వేట్టయాన్' అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 'వేట్టయాన్' చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ జ్ఞానవేల్ రాజా దర్శకుడు.